అకాల వర్షాలతో ఆ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.. ఆరు గాలం కష్ట పడి పండించిన పంట చేతికొచ్చినట్లే వచ్చి వరదలకు కొట్టుకుపోతే తల్లడిల్లి పోయాడు.. ప్రకృతి ప్రకోపించింది.. ఏం చేయలేం.. పంటకు భీమా చేసుకున్నాను కదా.. ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఆసరాగా ఉంటుంది అనుకున్నాడు ఆ రైతు.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫజల్ భీమా యోజన కింద వచ్చే నష్టపరిహారం తనను అదుకుంటుంది ఆశతో ఉన్నాడు. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం.. అకౌంట్ల పడ్డ డబ్బులు చూసి రైతు షాక్ అయ్యారు.. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకాలోని శిలోట్టర్ గ్రామానికి చెందిన మధుకర్ బాబూరావు పాటిల్.. నష్టపరిహారంగా తన బ్యాంకు ఖాతాల్లో పడ్డ రూ. 2.30 పైసలు చూసి షాక్ అయ్యాడు. మా పంట పూర్తిగా నాశనం అయ్యింది. ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరూ లేరు. ఇంత నష్టం జరిగినప్పటికీ నా బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 2.30 మాత్రమే జమ కావడం చూసి షాక్ అయ్యాను" అని బాబూరావు లబోదిబోమన్నాడు.
2023లో మహారాష్ట్రలో సంభవించిన అకాల వర్షాల కారణంగా శిలోట్టర్ గ్రామంలోని రైతులు పంటలు మొత్తం నీటిపాలయ్యాయి..పంట నీటిలో మునిగిపోయి కుళ్ళిపోయింది. గడ్డి కూడా నల్లగా మారింది.పశువులకు మేత కొరత ఏర్పడింది. రైతులతోపాటు బాబురావు పేరు మీద, ఆయన భార్య, కుమార్తెల పేరు మీద ఆరు నుంచి ఏడు ఎకరాల భూమి లో పంట మొత్తం వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది.
పంటనష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు జూలై 16న రైతుల ఖాతాల్లో జమ చేసింది. మధుకర్ బాబూరావు పాటిల్ తనకున్న 2.51 హెక్టార్ల భూమికి రూ.1లక్షా 53వేల110 పరిహారం వచ్చినట్లు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లింపును చూపించే రసీదులో తేలింది. అయితే శుక్రవారం పాటిల్ కు వచ్చిన మేసేజ్ లో అతని బ్యాంకు ఖాతాలో రూ.2.30 మాత్రమే జమ అయినట్లు చూపించింది. దీంతో రైతు బాబూరావు షాక్ తిన్నాడు.
ఇదేంటని అధికారులను నిలదీస్తే.. టెక్నికల్ సమస్యల వల్లే ఇలా జరిగిందన చావు వార్త చల్లగా చెప్పారు. వాస్తవానికి బాబూరావు కు ఫసల్ బీమా యోజన కింద నష్టపరిహారం రూ.1లక్షా 53వేల110 వచ్చినప్పటికీ అతని ఖాతాలో రూ. 2.30పైసలు జమ అయ్యాయి. ఈవిషయాన్నిరైతుకు తెలిపాం.. తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
