
తెలంగాణలోని రేషన్ షాపుల్లో పండగ వాతావరణ నెలకొంది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు.. అలాగే లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దశల వారీగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. దీంతో లబ్దిదారుల సంఖ్య పెరగడంతో సన్నం బియ్యం సప్లై కూడా నెలనెలకు పెరుగుతోంది.
రాష్ట్రంలో కొత్తగా 11లక్షలకు పైగా లబ్ధిదారులు చేరారు. పాత కార్డుల్లో అదనంగా 10 లక్షల 12 వేల 199 పేర్లు నమోదయ్యాయి. వీరి చేరికతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య రెండు కోట్లు దాటింది. 31 వేల కుటుంబాలు అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం.
నెలనెలకు పెరుగుతోన్న లబ్ధిదారుల సంఖ్యతో సన్నం బియ్యం సప్లై పెరుగుతోంది. జనవరిలో లక్షా 79 వేల 175 టన్నుల బియ్యం పంపిణీ చేయగా..ఫిబ్రవరిలో లక్షా 79 వేల 723 టన్నులు. మార్చిలో లక్షాల 80 వేల 5 టన్నుల బియ్యం సరఫరా చేయగా..మేలో కోటి 80 లక్షల టన్నులకు చేరింది.