హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు యువకుడి బలి

హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు యువకుడి బలి

డ్రగ్స్ అతిగా తీసుకున్న ఓ వ్యక్తి చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. డ్రగ్స్ తీసుకుని చనిపోయిన కేసు హైదరాబాద్ లో ఇదే మొదటిది. బీ-టెక్ పూర్తయిన యువకుడు అతిగా డ్రగ్స్ తీసుకోవడంతో చనిపోయాడని తెలిపారు అడిషనల్ సీపీ DS చౌహాన్. మరణించిన వ్యక్తి గోవాలో మల్టిపుల్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. అనారోగ్యానికి గురైనా వారంలోనే చనిపోయాడని చెప్పారు. అతిగా డ్రగ్స్ తీసుకుంటే చనిపోతారని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. 

మరోవైపు హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రేమ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డ్రగ్స్ అమ్ముతున్నాడు. వీళ్ల దగ్గర నుంచి రామకృష్ణ, నిఖిల్, జీవన్ డ్రగ్స్ కొంటున్నారని గుర్తించారు పోలీసులు. ప్రధాన నిందితుడు లక్ష్మిపతిని త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతూ చనిపోయన బీటెక్ స్టూడెంట్.. డ్రగ్స్ అమ్మే ప్రేమ్ స్నేహితులు. ప్రేమ్ తో పాటు బీటెక్ స్టూడెంట్ కూడా డ్రగ్స్ అమ్మడంతో పాటు.. డ్రగ్స్ తీసుకుంటున్నాడని పోలీసులు చెప్పారు. 

For More News..

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు