రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. డ్రైవర్ల నియామకాల్లో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని, పోలీసు రిక్రూట్‌‌‌‌మెంట్ సెల్ ద్వారా నియామకాలు ఉంటాయని తెలిపారు. 

డ్రైవర్ నియామకాల్లో ఎత్తు అడ్డంకిగా మారిందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి తెలిపారు. డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు అవసరమనే వార్తల్లో నిజం లేదన్నారు. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం కనీస ఎత్తు 5.3 అడుగులు మాత్రమేనని వివరించారు.