రాష్ట్రంలో అమూల్ మోడల్ ను అమలు చేస్తం : మంత్రి వాకిటి శ్రీహరి

రాష్ట్రంలో అమూల్ మోడల్ ను అమలు చేస్తం :  మంత్రి వాకిటి శ్రీహరి
  •     మంత్రి వాకిటి శ్రీహరి  
  •     గుజరాత్​లోని ప్లాంట్​ను సందర్శించిన ఐదుగురు సభ్యుల బృందం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమూల్ మోడల్‌‌‌‌ను అమలు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ ​జిల్లాలో గల ప్రసిద్ధ అమూల్​మిల్క్​ప్రాసెసింగ్​ప్లాంట్​ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్​చైర్మన్ అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆదివారం సందర్శించారు. 

అమూల్ సంస్థలో అమలవుతున్న ఆధునిక సాంకేతిక విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలు, పాల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను నేషనల్ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్ బోర్డు(ఎన్​డీడీబీ) చైర్మన్ డాక్టర్ మీనేశ్​షా వారికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం, సహకార వ్యవస్థను విస్తరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పాడి పరిశ్రమకు సంబంధించి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.