కేసీఆర్ కుటుంబంపై ఫ్లెక్సీలు..ఉద్యమం, సెంటిమెంట్ ముసుగులో భూములను దోచుకున్నారని రాతలు

కేసీఆర్ కుటుంబంపై ఫ్లెక్సీలు..ఉద్యమం, సెంటిమెంట్ ముసుగులో భూములను దోచుకున్నారని రాతలు
  •     తెలంగాణ తల్లి ఫ్లైఓవర్​పై ఏర్పాటు

ట్యాంక్ బండ్, వెలుగు: హైదరాబాద్‌‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వెనుక తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌‌‌‌పై మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై పలు ఆరోపణలు చేస్తూ గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘చరిత్రలో ప్రజల కోసం పోరాటం చేసిన యోధులు ఆస్తులు పోగొట్టుకున్నారు. కానీ, తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్ ముసుగులో కోట్లాది రూపాయల ఖరీదు చేసే భూములను కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది’ అంటూ  ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలానికి దారి తీసింది. 

కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌‌రావు, జోగినిపల్లి కుటుంబం, నవీన్​కుమార్, కొండల్​రావు కుటుంబం, వారి కుటుంబసభ్యులు, భూములున్న ప్రాంతాలు, భూముల వివరాలు అంటూ తొమ్మిది జిల్లాల్లోని 24 మండలాల్లో ఉన్న 31 గ్రామాల్లో 439.30 ఎకరాలు ఆక్రమించుకున్నారని రాశారు. కింద ‘కక్కిస్తాం రాసి పెట్టుకోండి.. కల్వకుంట్ల దొంగలు’ అని హెచ్చరించారు.