న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి నలుగురు పోలీసు అధికారులకు ప్రతిష్టాత్మకమైన ‘కేంద్రీయ గృహ మంత్రి పదక్’అవార్డులు దక్కాయి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది గాను ‘కేంద్రీయ గృహ మంత్రి పదక్’అవార్డులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి కేంద్రం ఈ అవార్డులను ప్రదానం చేయనుంది.
దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 1,466 మంది పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో తెలంగాణ నుంచి నలుగురి, ఏపీ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు అవార్డులను అందుకోనున్నారు.
