- విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ, వెలుగు : ప్రతి వాహనదారుడు తమ వాహనాన్ని భద్రంగా, బాధ్యతతో నడపాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి విప్ ప్రారంభించారు. ట్రాఫిక్ సిగ్నల్ రంగుల్లో ఉన్న సిద్ధం చేసిన బెలూన్లను, శాంతి కపోతాలను ఎగురవేసారు. అనంతరం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి
కోరుట్ల బస్టాండ్ వరకు స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా పెట్రోల్ పోయొద్దని కోరారు. అంతకుముందు విలీన గ్రామాలు శాత్రాజుపల్లి, నాంపల్లిలో కుల సంఘాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి మంజూరు పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాఉడతూ రెండేళ్లుగా రాజన్న ఆలయంతోపాటు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, డీటీవో లక్ష్మణ్,ఆర్డీవో రాధాబాయి, ఎంవీఐ వంశీ, ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
