V6 News

కరోనా నిబంధనలు పాటించడం అత్యంత కీలకం

కరోనా నిబంధనలు పాటించడం అత్యంత కీలకం

కరోనా నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయడం.. వైరస్ నివారణలో అత్యంత కీలకమైన అంశమన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా నిబంధనలు పాటించడం, అందరూ వాక్సినేషన్ తీసుకోవడం తక్షణ కర్తవ్యమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ.. మరింతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర, జిల్లాల ప్రతినిధులతో వర్చువల్ పద్ధతిలో ఇంటరాక్ట్ అయ్యారు గవర్నర్. ఈ సంక్షోభ సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అపూర్వమని అభినందించారు. మరింత ఎక్కువ మంది వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు చేపట్టి నిస్సహాయులకు అండగా నిలవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.