తాడ్వాయి, వెలుగు : మార్చి 25న ప్రమాదవశాత్తు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద రాతి శిల పడి గాయపడిన సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేశ్ కొడుకు యువిన్ ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకుంది. శనివారం ములుగు కలెక్టరేట్లో యువిన్ తల్లి సిద్ధబోయిన స్వప్నకు దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ దివాకర టీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
నియామకపత్రాన్ని, రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని మంత్రి సీతక్క అందజేశారు. ఏఎంసీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఎండోమెంట్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఉన్నారు.

