V6 News

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్.. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్.. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా జరుగుతున్న పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పిచ్ పరిస్థితులను అంచనా వేస్తూ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని చూస్తుండగా, మరోవైపు, రహానే సేన తమ బౌలింగ్ బలాన్ని నమ్ముకుని ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని భావిస్తోంది.

రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాము.. గత మ్యాచ్ మాకు ఒక మంచి పాఠం.. ఈ మ్యాచ్‌లో మంచి స్కోరుతో శుభారంభం చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం.. పిచ్ చాలా పొడిగా కనిపిస్తోందని, నిన్ననే గడ్డిని కత్తిరించడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. తుది జట్టులోకి ప్రిటోరియస్, తుషార్ దేశ్‌పాండే స్థానాల్లో హెట్మెయర్, బ్రిజేష్ తిరిగి వచ్చారని పేర్కొన్నాడు. 

కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. టాస్ ఓడిపోయినా తాను సంతోషంగా ఉన్నాను.. బ్యాటర్లు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌లుగా అద్భుతంగా రాణిస్తున్నారు.. మనం గతం గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి చెప్పలేం.. అందుకే మన చేతుల్లో ఉన్న అంశాల మీద దృష్టి పెట్టడం ముఖ్యం.. ఎటువంటి మార్పులు లేకుండా పాత జట్టుతో బరిలోకి దిగుతోందని రహానే తెలిపారు. 

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి,  వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ

రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్
ఇంపాక్ట్ ప్లేయర్స్:  సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా