ములుగు, వెలుగు : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, నేరుగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
శనివారం ములుగు మండలం రాయినిగూడెం జీపీ ఆఫీస్లో రాయినిగూడెం, కొత్తూరు, పంచోత్తుల పల్లె గ్రామాలు, సర్వాపురంలో మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పెగడపల్లి, సర్వాపురం, అంకన్నగూడెం గ్రామాల ప్రజల సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో మంత్రి, కలెక్టర్ దివాకరతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
