V6 News

ఇండస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : ప్రొ.కర్నాటి ప్రతాప్ రెడ్డి

ఇండస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : ప్రొ.కర్నాటి ప్రతాప్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: వరంగల్ మహానగరంలో యువత, మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న ఇండస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొ.కర్నాటి ప్రతాప్ రెడ్డి అన్నారు.

ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'శిఖర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్'లో మహిళలకు టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్ తదితర పనుల్లో ట్రైనింగ్ తీసుకున్న దాదాపు 260 మందికి శనివారం వీసీ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా నక్కలగుట్టలోని హరిత హోటల్ లో సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యతో పాటు వృత్తిలో నైపుణ్యం సాధించాలన్నారు. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఇంట్లో మహిళ సాధికారత సాధిస్తే ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుందన్నారు. నీలిమా హాస్పిటల్స్ చైర్మన్ పల్లా నీలిమా తదితరులు పాల్గొన్నారు.