V6 News

కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలే :  బీవీ.పాపారావు

కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలే :  బీవీ.పాపారావు

వరంగల్‍, వెలుగు: ప్రపంచంలోనే ఓరుగల్లువాసులకు దక్కిన అద్భుతమైన కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలని కాకతీయ హెరిటెజ్‍ ట్రస్టీలు రిటైర్డ్​ఐఏఎస్‍లు బీవీ.పాపారావు, బీపీ ఆచార్య, నిట్‍ రిటైర్డ్​ ప్రొఫెసర్‍ పాండురంగరావు సూచించారు. శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓరుగల్లులోని పలు వారసత్వ కట్టడాలను వారు సందర్శించారు.

హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రెస్‍మీట్‍ నిర్వహించి మాట్లాడారు. రామప్ప ఆలయానికి ప్రపంచస్థాయి యునెస్కో గుర్తింపు రావడానికి పురావస్తుశాఖతో పాటు రాష్ట్ర హెరిటెజ్‍ సహకారంతో ఎంతో కృషి చేశామన్నారు. కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్ అథారిటీ తరఫున వారసత్వ సంపద పరిరక్షణకు మొదటినుంచి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.