V6 News

PBKS vs LSG మధ్య హైవోల్టేజ్ పోరు.. గెలిచేది మాత్రం ఆ టీమ్!

PBKS vs LSG మధ్య హైవోల్టేజ్ పోరు.. గెలిచేది మాత్రం ఆ టీమ్!

PBKS vs LSG: ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పరస్పర విరుద్ధమైన స్థానాల్లో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కాసేపట్లో (2026, ఏప్రిల్ 19న) ముల్లాన్‌పూర్‌ వేదికగా తలపడనున్నాయి. గత సీజన్ రన్నరప్ గా నిలిచిన పంజాబ్, ఈ సీజన్‌లో అజేయంగా దూసుకుపోతుండగా.. లక్నో వరుస ఓటములతో సతమతమవుతోంది.

పిచ్ రిపోర్ట్:
ఈ కొత్త స్టేడియంలో బ్యాటింగ్‌కు స్వర్గధామం అని చెప్పాలి.. ఇక్కడ అవుట్‌ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది, బౌండరీలు కూడా చిన్నవిగా ఉండటంతో.. పరుగులు చేయడం సులభంగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టునే విజయం సాధించింది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.5 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.

విజేత ఎవరు?: 
ప్రస్తుత ఫామ్, సొంత గడ్డపై ఉన్న రికార్డులను బట్టి చూస్తే పంజాబ్ కింగ్స్ (PBKS) ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ జైత్రయాత్రను అడ్డుకోవడం లక్నోకు సవాలుతో కూడుకున్న పనే.

ఇరు జట్ల అంచనా: 
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్. 
ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/ వికెట్ కీపర్), మాథ్యూ బ్రీట్జ్కే, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, జార్జ్ లిండే, మహ్మద్ షమీ.  ఇంపాక్ట్ ప్లేయర్: ఆయుష్ బదోని