V6 News

CSKపై చేతబడి చేసిన SRH అభిమాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

CSKపై చేతబడి చేసిన SRH అభిమాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

SRH vs CSK: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టేడియంలో ఉన్న ఒక అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో CSK బ్యాటర్ శివమ్ దూబే క్రీజులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. SRH జెర్సీ ధరించిన ఒక అభిమాని గ్యాలరీలో ఉండి వింత చేష్టలు, హావభావాలు చేస్తూ కెమెరాకు చిక్కాడు. నెటిజన్లు దీనిని సరదాగా "బ్లాక్ మ్యాజిక్" (చేతబడి) అని పిలుస్తున్నారు.

ఆ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకుని వింత హావభావాలు చేసిన మరుక్షణమే మైదానంలో ఊహించని పరిణామం జరిగింది. SRH బౌలర్ సాకిబ్ హుస్సేన్ వేసిన బంతికి శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి నేరుగా స్టంప్స్‌ను ఎగరగొట్టడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అయితే ఆ అభిమాని సంజ్ఞలు చేయడం, వెంటనే వికెట్ పడటం సరిగ్గా ఒకే సమయంలో జరగడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ హంగామా మొదలైంది. 

అయితే"SRH విజయం వెనుక రహస్యం ఇదేనా?" అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూఢనమ్మకం కంటే ఇది ఒక అద్భుతమైన యాదృచ్ఛికం (Coincidence) అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ డ్రామాకు ఈ వింత సంఘటన మరింత మజాను జోడించింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో SRH విజయం సాధించడమే కాకుండా, ఈ "బ్లాక్ మ్యాజిక్" వీడియో సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. మరోవైపు, ఇక ఘటనపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం SRH అభిమానిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వీడియోలోని వ్యక్తి సహా హైదరాబాద్ జట్టుపై విచారణ చేసి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.