అణుచర్చలు,ప్రాంతీయ భద్రతపై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడుపెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా అణు శక్తి హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు.. మేం గౌరవప్రదంగా యుద్దం ముగించాలనుకుంటున్నాం.. దేశంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడంపైనే మా దృష్టి అని అన్నారు.
మా అంతట మేం యుద్ధాన్ని ప్రారంభించలేదు. ఇతర దేశాలపై దాడులు చేసే ఉద్దేశం మాకు లేదు.. ఇప్పుడు యుద్దాన్ని విస్తరించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. మేం ఏ దేశంపైనా దారి చేయాలనే ఉద్దేశం మాకు లేదు.. మా చట్టబద్దమైన, న్యాయబద్దమైన ఆత్మరక్షణకు హక్కును కాపాడుకుంటున్నామని చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ కు చెందిన ఆయిల్, పవర్ కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా తమ లక్ష్యాలను సాధించాలనకున్నారు. అంతర్జాతీయ చట్టలను ఉల్లంఘించారు. అయితే వారి ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వారి లక్ష్యాలను చేరుకోలేక అంతర్జాతీయ చట్టలను ఉల్లంఘించి మా మౌలిక సదుపాయాలు, స్కూళ్లు, ఆస్పత్రులపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించింది.
ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని పెజెష్కియన్ విమర్శించారు. టెహ్రాన్ అణు కార్యకలాపాలను వాషింగ్టన్ ఏ ప్రాతిపదికన పరిమితం చేయాలని కోరుకుంటోందని ప్రశ్నించారని రాయిటర్స్ నివేదించింది. ఇరాన్ తన అణు హక్కులను వినియోగించుకోకూడదని ట్రంప్ అంటున్నారు..కానీ ఏ నేరానికి అన్నది చెప్పడం లేదు. ఒక దేశం హక్కులను హరించడానికి ఆయన ఎవరు?" అని పెజెష్కియన్ అన్నట్లు ఇరానియన్ స్టూడెంట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. యుద్దం ముగియాలంటే.. అమెరికా పెట్టిన డిమాండ్లపై చర్చలకు ఉండబోవని ఇరాన్ సీనియర్ అధికారి తెలిపినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ట్రంప్ వాదనలు తోసిపుచ్చుతూ ఇరాన్ ఎన్నడూ అమెరికాకు యురేనియం బదిలి చేయదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతీబ్జాదే అన్నారు.

