హైదరాబాద్: ప్రజావాణికి 1,627 అప్లికేషన్లు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వచ్చినవే 1,462

హైదరాబాద్: ప్రజావాణికి  1,627 అప్లికేషన్లు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వచ్చినవే 1,462

హైదరాబాద్ సిటీ , వెలుగు: కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో 1,627 దరఖాస్తులు రాగా, ఇందులో అత్యధికంగా 2 బీహెచ్​కేల కోసం వచ్చినవే ఉన్నాయి. సోమవారం అడిషనల్​కలెక్టర్లు కదిరవన్ పళని, జితేందర్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించగా.. డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల కోసం 1,462 అర్జీలు వచ్చాయి. తర్వాత పింఛన్లకు 120 మంది, రెవెన్యూ సమస్యలపై 16 మంది, ఇతర శాఖలకు సంబంధించి 29 మంది అప్లికేషన్​ పెట్టుకున్నారు.