ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అప్లై చేసుకోండి

ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అప్లై చేసుకోండి

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజయకుమార్  కోరారు. కామర్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, జువాలజీ విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీ ఉందన్నారు. 

అర్హత గల అభ్యర్థులు ఈ నెల 22లోపు అప్లై చేసుకోవాలన్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ, నెట్, సెట్ అర్హతతోపాటు బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. వివరాలకు 98664 16969 ఫోన్​నంబర్​లో సంప్రదించాలని సూచించారు.