హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అందించే దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం–2026కు ప్రము ఖ సాహితీవేత్త గుడిపాటి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యువ జన అభ్యున్నతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందించే ఈ పురస్కారంలో రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, శాలువా ప్రదానం చేస్తారు.
సూర్యాపేటకు చెందిన గుడి పాటి వెంకటేశ్వర్లు సాహిత్యం, జర్నలిజం రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఇప్పటివరకు 13 పుస్తకాలు రచించగా, కవిత్వం, కథ, విమర్శ, జీవితచరిత్రలు, సాహిత్య వ్యాసాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఆయన రచించిన ‘సంవిధానం’ గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శనా గ్రంథ పురస్కారం లభిం చింది. 2023లో తెలంగాణ సారస్వత పరి షత్ విశిష్ట పురస్కారం అందుకున్నారు. ఆంధ్రజ్యోతి, వార్త, నవతెలంగాణ పత్రికల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన గుడిపాటి ప్రస్తుతం ‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రిక సంపాదకుడిగా, ‘పాలపిట్ట బుక్స్’ ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా కొనసాగుతున్నారు.
