కూకట్‌పల్లి, వెలుగు: కూకట్‌పల్లి రామాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన గరుడ, హనుమద్ మూర్తుల స్థాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన కుంభప్రోక్షణ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి శాంతిపాఠం, మూల మంత్ర హవనాలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. దేవాలయం ముందు గరుడ, హనుమద్ మూర్తులను ఎందుకు ఏర్పాటు చేస్తారో వివరించారు. అనంతరం సీతారామచంద్రుల కల్యాణం, పట్టాభిషేకం, అన్నదానం నిర్వహించారు.
