H-1B వీసా: అమెరికాలో భారతీయ టెకీకి 'స్క్విడ్ గేమ్' లాంటి కష్టం.. కంపెనీ యజమానిపై కేసు...

H-1B వీసా: అమెరికాలో భారతీయ టెకీకి 'స్క్విడ్ గేమ్' లాంటి కష్టం.. కంపెనీ యజమానిపై కేసు...

 H-1B వీసాపై అమెరికాలో పనిచేస్తున్న ఒక భారతీయ టెక్ ఉద్యోగి  US కంపెనీ ఓనర్ పై కోర్టులో కేసు వేశాడు.  కంపెనీ, దాని  CEO తనను బలవంతంగా పనిచేయించుకోవడం, జీతం ఇవ్వకపోవడం, కుల వివక్షతో దోపిడీకి గురిచేశారని  ఆరోపించాడు.

అమృతేష్ వల్లభనేని అనే టెకీకి గ్రీన్ అమెరికాలోని ఓ కంపెనీ కార్డు ఇప్పిస్తామని హామీ ఇచ్చిందట. కానీ హామీ పేరుతో వాళ్ళకి నచ్చినట్టు పనిచేయలని, లేదంటే దేశం నుండి పంపించేస్తామని బెదిరించినట్లు తన  పిటిషన్లో పేర్కొన్నారు.

అమృతేష్  వల్లభనేని తరపున సహాయం చేస్తున్న కన్సల్టెంట్ జే పామర్ మాట్లాడుతూ భారతీయ ఉద్యోగులకు ఇదొక స్క్విడ్ గేమ్ లాంటిది. ఇక్కడ చివరి లక్ష్యం ఎలాగైనా అమెరికాలో ఉండిపోవడం.... ఇది చాలా దోపిడీ చేసే వాతావరణం. భారతీయ CEOలు అమెరికాలోని పని ప్రదేశాలకు కూడా కుల వివక్ష రాజకీయాలను తీసుకొస్తున్నారు అని ఆరోపించారు.

అమృతేష్ వల్లభనేని 2015లో చదువు కోసం అప్పు చేసి F-1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. సిరిసాఫ్ట్ అనే కంపెనీ, దాని యజమాని పవన్ టాటా అమృతేష్  వల్లభనేనిపై ఎక్కువ పనిభారం పెడుతూ, డబ్బులు వసూలు చేయడానికి H-1B విధానాన్ని అడ్డు పెట్టుకొని  వాడుకున్నారని ఆరోపించారు.

కంపెనీ అతనికి సరిపడా జీతం ఇవ్వకుండా, ఆరు నెలల పాటు తన జీతాన్ని తానే కట్టుకోవాలని అంటే కంపెనీకి తిరిగి కట్టాలని   కోరిందని పిటిషన్లో ఉంది. ఇలా చేయడం చట్టవిరుద్ధం.

 ఈ తప్పులు చేస్తు.. సిరిసాఫ్ట్  మా మాట వినకపోతే H-1B వీసాను రద్దు చేస్తామని బెదిరించిందని, అందుకే అమృతేష్ వల్లభనేని కంపెనీని వదిలి వెళ్లలేకపోయాడని పేర్కొన్నారు.

 సిరిసాఫ్ట్ గ్రీన్ కార్డ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి, దాన్ని అస్త్రంగా వాడుకుంది. కంపెనీ అక్రమ డిమాండ్లు ఒప్పుకోకపోతే, గ్రీన్ కార్డు ప్రక్రియ ఆపేస్తామని లేదా పూర్తిగా రద్దు చేస్తామని బెదిరించింది. దాంతో వల్లభనేని అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుందని భయపడ్డాడు.

అమృతేష్  వల్లభనేనికి తన జీతం సరిపోకపోవడంతో అద్దె, ఇతర అవసరాలకు కూడా మరింతగా కష్టపడాల్సి వచ్చిందని, ఆరోగ్య బీమా కోల్పోయాడని, దింతో తనకు, తన భార్యకు అవసరమైన వైద్యం కూడా అందలేదని పేర్కొన్నారు.

పిటిషన్లో అమృతేష్ వల్లభనేని కంపెనీ నుండి నష్టపరిహారం అలాగే న్యాయవాది ఖర్చులు కోరుతున్నారు. ఇటువంటి పనులు సిరిసాఫ్ట్ వ్యాపార విధానంగా కనిపిస్తున్నాయని, ఇవి బలవంతపు శ్రమదోపిడీ, కార్మిక అక్రమ రవాణా కిందకే వస్తాయని పిటిషన్లో చెప్పారు.