ప్రేమ పేరుతో వేధింపులు  బాలిక ఆత్మహత్య

ప్రేమ పేరుతో వేధింపులు  బాలిక ఆత్మహత్య

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రానికి చెందిన కుసుమరాజు వర్షిత(17) ఖమ్మంలోని ప్రైవేటు హాస్టల్​లో ఉంటూ వైరా రోడ్డులో ఉన్న ఆసుపత్రిలో పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న కృష్ణా జిల్లా తిరువూరు మండలం మనుకొల్ల గ్రామానికి చెందిన మల్లవరపు మధుకుమార్​వర్షితను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. మధుకుమార్​కు గతంలోనే పెండ్లయింది. అతడి వేధింపులు భరించలేక వర్షిత నాలుగు రోజుల క్రితం మరో ఆసుపత్రిలో చేరింది. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో వర్షిత మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. వర్షిత చావుకు మధుకుమార్​కారణమని, అతనిని కఠినంగా శిక్షించాలంటూ వర్షిత తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.