భారీగా ట్రాఫిక్ జామ్.. నిమిషాల జర్నీకి గంటల సమయం.. హైదరాబాద్ రోడ్లపై వాహనదారుల నరకం

భారీగా ట్రాఫిక్ జామ్.. నిమిషాల జర్నీకి గంటల సమయం.. హైదరాబాద్ రోడ్లపై వాహనదారుల నరకం

ఉదయం9 దాటినా  హైదరాబాద్ అంతా చీకటి మయమే. ఎక్కడ చూసిన భారీ వర్షమే. ముందున్న మనుషులే కాదు..వాహనాలు కూడా కనిపించే పరిస్థితి లేదు. మొత్తం చీకటే. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఆకాశం కొండోలే అయింది. పొద్దున 9 దాటినా కూడా  వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా కిలో మీటర్ కూడా ముందుకు కదల్లేని స్థితి. కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్. భారీ వర్షాలు..వరదలతో రోడ్లపై వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

ఓ వైపు భారీ వర్షం..మరోవైపు రోడ్లపై వరదనీరు..ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతా నీటమునిగింది. ఈ క్రమంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లపైకి వస్తే వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. కూకట్ పల్లి నుంచి అమీర్ పేట్ వైపు వచ్చే వాహనాలు..రోడ్లపైనే నిలిచిపోయాయి. జాతీయ రహదారి 65 పై కార్లు, బైకులు, బస్సులు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. 

అటు జీడిమెట్ల నుంచి బాల్ నగర్, బోయిన్ పల్లి మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. సాధారణంగా జీడిమెట్ల నుంచి బోయిన్ పల్లి వరకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ ఇప్పుడైతే గంట కాదు కదా..రెండు గంటలైనా చేరుకోలేని పరిస్థితి. అంతలా ఆ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై 100 మీటర్ల దూరం వెళ్లాలంటే  కార్లు, బైకులు, బస్సులు అరగంటకు పైగా సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. 

మేడ్చల్ నుంచి సుచిత్ర, బోయిన్ పల్లి మీదుగా సికింద్రాబాద్ వచ్చే దారిలో కూడా అదే ట్రాఫిక్ జామ్ నరకం. బైకులు, సొంత వాహనాలు అయితే డేంజర్ లో పడతామని అనుకున్న ప్రజలు..సొంత వాహనాలు ఇంటి దగ్గరే వదిలి బస్సులు, ఆటోల్లో బయలుదేరారు. అయినా కూడా సరైన సమయానికి ఆఫీసులు, తమ కార్యాలయాలకు చేరలేని పరిస్థితి. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలన్నీ స్ట్రక్ అయిపోయాయి. చాలా అంటే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. నిమిషాల ప్రయాణానికి గంటల తరబడి వాహనాల్లో ప్రయాణించాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

ఇక అమీర్ పేట్ నుంచి బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే దారి మరింత నరకప్రాయంగా తయారైంది. రాను పోను వాహనాలు..ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లపై వరదనీరు ప్రవాహంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాహనదారులు..తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

జూబ్లి హిల్స్ నుంచి  మాదాపూర్ మీదుగా కొండాపూర్ వెళ్లే రోడ్ అయితే..ఫుల్ ప్యాకప్ అయిపోయింది. ముందు వాహనాలు వెళ్లే పరిస్థితి లేక..వెనకకు వెళ్లలేక..రోడ్లపైనే గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది వాహనదారులకు. హైటెక్ సిటీ, కొండాపూర్ వైపే అన్ని ఐటీ కంపెనీలు ఉండటంతో సిటీలోని అన్ని వాహనాలు ఇటు వైపే మళ్లాయి. దీంతో జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఐకియా రోడ్డు వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది.