హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది

హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్నామని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ ఇష్యూపై దర్యాప్తు ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని, ఈ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బయటపెట్టడం సబబు కాదని పేర్కొంది.  హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు 60 శాతం మేర క్రాష్ అయ్యాయి. ఇన్వెస్టర్లు  పెద్ద మొత్తంలో నష్టపోయారు. హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టులో  ఓ  పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పడింది. దీనిపై  కోర్టు హియరింగ్ చేపడుతూ, ఈ ఆరోపణలపై రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సెబీని  ఆదేశిచ్చింది. ‘హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఒక యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్లర్ కంపెనీ. ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గవర్నెన్స్ ఫ్రాడ్స్ జరిగాయని అనుకున్న కంపెనీలపై రీసెర్చ్ చేసి రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేస్తోంది. హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ వంటి షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్లర్లు ఇటువంటి కంపెనీల బాండ్లు, షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకొని, ఆ తర్వాత తమ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పబ్లిష్ చేస్తున్నాయి’ అని సెబీ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇటువంటి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమ్మేకొద్దీ బాండ్లు, షేర్లలో పెట్టిన ‘స్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’   హిట్ అవుతాయని, షేర్లు మరింత పడతాయని తెలిపింది.   మార్కెట్  మెరుగ్గా ఉందని, మిగిలిన గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే వేగంగా రికవరీ అవుతోందని  తెలిపింది. అదానీ– హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఇష్యూపై ఫైనాన్స్ మినిస్ట్రీకి సెబీ  ఈ వారం  రిపోర్ట్ అందించనుంది. మరోవైపు ఇన్వెస్టర్ల ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు మార్పులు అవసరమా? అనే అంశంపై పరిశీలినలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం లేదని కేంద్రం పేర్కొంది. సెబీ వంటి రెగ్యులేటరీలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా సుప్రీం కోర్టే కమిటీ ఏర్పాటుపై సలహాయివ్వడంతో మేము కూడా సిద్ధంగా ఉన్నామని వివరించింది.  

క్యాష్ ఫ్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగున్నాయి..

తమ కంపెనీల బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బాగున్నాయని, కార్పొరేట్ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని అదానీ గ్రూప్ సోమవారం ప్రకటించింది. తమ వద్ద  మెరుగైన అసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని పేర్కొంది.  తమ బిజినెస్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది. 

అదానీ షేర్లు క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ షేర్లు సోమవారం 7% నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 %, అదానీ పవర్ 5 %, అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్ 5%, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 5 % చొప్పున పడ్డాయి. అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదానీ విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు  కూడా 5 % చొప్పున క్రాష్ అయ్యాయి. ఏసీసీ షేర్లు 3 %, అంబుజా సిమెంట్స్ షేర్లు 5 %, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీటీవీ షేర్లు 5 % పడ్డాయి.