మణిపూర్ ఘటన.. కేంద్రం సంచలన నిర్ణయం

మణిపూర్ ఘటన.. కేంద్రం సంచలన నిర్ణయం

మణిపూర్ లో ఇద్దురు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై విచారణకు  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఝ(సీబీఐ) అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.  

దీంతో పాటు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది.  ఈ అమానుష ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టబోమని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ ఘటన ఈ ఏడాది మేలో జరగగా, దీనికి సంబంధించిన వీడియో ఇటీవల బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

వీడియోలో కనిపించే మహిళల్లో ఒకరు మాజీ ఆర్మీమాన్ భార్య.. ఆమె అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పనిచేసి కార్గిల్ యుద్ధంలో కూడా పోరాడారు.  ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.  

ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించాలని ఇటీవల పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.