మా గేటెడ్ కమ్యూనిటీలో EV ఛార్జింగ్ పాయింట్లు పెట్టొద్దు.. కోర్టుకెక్కిన వివాదం.. పేలతాయనే భయమా..?

మా గేటెడ్ కమ్యూనిటీలో EV ఛార్జింగ్ పాయింట్లు పెట్టొద్దు.. కోర్టుకెక్కిన వివాదం.. పేలతాయనే భయమా..?

ఎలక్ట్రిక్ బైక్.. ఎలక్ట్రిక్ కారు.. ఇప్పుడు కామన్ అయిపోయాయి. పొల్యూషన్ ఫ్రీ అని.. పెట్రోల్ ఖర్చు లేదని.. మెయింటెనెన్స్ తక్కువ అని అందరూ ఈవీ వెహికల్స్ వైపు డైవర్ట్ అవుతున్నారు. ఇప్పటికే లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. పొద్దంతా రోడ్లపై తిరిగి.. రాత్రికి ఇంటికి చేరిన తర్వాత.. సింపుల్ గా చార్జింగ్ పెట్టేసుకుంటే సరి.. మరి ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్ కు కష్టాలు వచ్చాయి.. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీల్లో.. పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లలో ఉండే వాళ్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ విషయంలో.. ఓ గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ పై.. ఈవీ వెహికల్స్ ఓనర్లు.. ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.. అవును వాహనాల ఛార్జింగ్ విషయంలో సొసైటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటీ.. సుప్రీంకోర్టులో కేసు ఏంటీ అనేది వివరంగా తెలుసుకుందామా...

 ఏం జరిగిందంటే : గ్రేటర్ నోయిడాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండే  రచిత్ కత్యాల్ అనే వ్యక్తి అతని ఎలక్ట్రిక్ కారు కోసం సొంతంగా ఛార్జర్ ఏర్పాటు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, హౌసింగ్ సొసైటీ (RWA) అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికే కామన్ ఏరియాలో రెండు ఛార్జర్లు ఉన్నాయని, పర్సనల్ ఛార్జర్లు వద్దని  చెప్పారు. 4 వేల ఫ్లాట్లు ఉన్న చోట కేవలం 2 ఛార్జర్లు సరిపోవని, ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రకారం సొంత పార్కింగ్ ప్లేస్‌లో ఛార్జర్ పెట్టుకునే హక్కు తనకు ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వ నిబంధనలు: 
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం  అపార్ట్‌మెంట్‌లో ఉండే వాళ్ళు  సొంత పార్కింగ్ స్థలంలో EV ఛార్జర్లు పెట్టుకోవచ్చు. దీనికి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేదు. దీని కోసం వాడే కరెంటుకు సాధారణ డొమెస్టిక్ టారిఫ్ మాత్రమే వర్తిస్తుంది. కానీ హౌసింగ్ సొసైటీలు సరైన కారణం లేకుండా వీటిని అడ్డుకోకూడదు.

 భయం ఎందుకు?
అపార్ట్‌మెంట్ కమిటీలు ముఖ్యంగా మూడు కారణాలతో భయపడుతున్నాయి.  బేస్‌మెంట్లలో బ్యాటరీల వల్ల మంటలు వస్తాయేమోనని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయేమో అని భయపడుతున్నాయి. అంతేకుండా ఒకేసారి చాలామంది ఛార్జర్లు వాడితే ట్రాన్స్‌ఫార్మర్ పై కరెంటు లోడ్ పడుతుందని ఆందోళన పడుతున్నాయి. ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీల వల్ల వేడి పుట్టి ప్రమాదాలు జరుగుతాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు నిజంగా ప్రమాదకరమా:
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆధునిక EVలలో 'బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (BMS) ఉంటుంది. ఇది వేడి ఎక్కువైతే ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ ఆపివేస్తుంది. పార్కింగ్ ఏరియాలో గాలి ఆడేలా వెంటిలేషన్ ఉంటే వేడి సమస్య ఉండదు. గుర్తింపు పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారా, నాణ్యమైన వైర్లతో ఇన్స్టాల్ చేస్తే  ఏసీ (AC) లేదా గీజర్ వాడినంత సురక్షితం. 
 
ఈ కేసు తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది EV యజమానులకు కీలకం కానుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్ననందున పర్యావరణానికి మేలు చేసే EVలను. ప్రోత్సహించాలంటే.. ఇంటి వద్ద ఛార్జింగ్ సదుపాయం కల్పించడం చాలా అవసరం.