హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఓపెన్..మూసీకి భారీ వరద

 హైదరాబాద్  జంట జలాశయాల గేట్లు ఓపెన్..మూసీకి భారీ వరద

 సిటీ జంట జలాశయాలైన హిమాయత్​సాగర్‌‌‌‌, ఉస్మాన్ సాగర్​కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఈ జలాశయాలకు వరద నీరు పెరుగుతోంది. దీంతో జలమండలి అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి  వదిలిపెట్టారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీకి 6,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు  అధికారులు.

ఉస్మాన్ సాగర్ కి 1800  క్యూసెక్కుల ఇన్ ఫ్లో  వస్తుండగా.. 6 గేట్లు ఎత్తి 2,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు  అధికారులు. 
హిమాయత్ సాగర్ కి 2,220 క్యూసెక్కుల ఇన్ ఫ్లో  వస్తుండగా... 4 గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు.ఎగువ ప్రాంతాల్లో వర్షం పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి మూసీకి నీటిని వదలనున్నారు  అధికారులు.

గేట్లు ఎత్తడంతో ముంపు ప్రాంతాలకు అలర్జ్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. చాదర్ ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాలకు హెచ్చరిక జారీ చేశారు.  నార్సింగి, మంచిరేవులకు  రాకపోకలు  నిలిచిపోయాయి.