అల్వాల్, వెలుగు: అల్వాల్ మచ్చ బొల్లారం డివిజన్లోని స్నేహ కాలనీలో ఆక్రమణకు గురవుతున్న పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1,008 చదరపు గజాల స్థలాన్ని లేఅవుట్ఏర్పాటు సమయంలో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించగా, కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు గురువారం పరిశీలించారు. స్థలం పార్కు కోసమే కేటాయించిందని నిర్ధారించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డు ఏర్పాటు చేశారు.
