జూబ్లీహిల్స్, వెలుగు: వెంగళ రావు నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు. గురువారం ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్, వెంగళరావు నగర్ కాలనీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ పి.వి.రవి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ఎమ్మెల్యేను యూసఫ్ గూడలోని ఆయన ఇంట్లో సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్యూనిటీ హాల్ పనులు చాలా కాలంగా మధ్యలోనే ఆగిపోయాయని, త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ సూపరిండెంట్ ఆఫ్ జైల్స్ ఎం. రంగారావు,ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ టీవీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఏజీ ఆఫీస్ సారంగారావు, ట్రెజరర్, హైకోర్ట్ అడ్వొకేట్లక్ష్మీకాంత రావు, మెంబర్స్రామయ్య,ప్రదీప్ కుమార్, కుటుంబరావు,వాసు పాల్గొన్నారు.
