ODI World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. కీలక మార్పుతో సౌత్ ఆఫ్రికా

ODI World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. కీలక మార్పుతో సౌత్ ఆఫ్రికా

వరల్డ్ కప్ లో మరో బ్లాక్ బస్టర్ కు సమరం ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న భారత్ తో రెండో స్థానంలో ఉన్న  దక్షిణాఫ్రికా తలపడనుంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. భారత జట్టు మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతుంటే.. సౌత్ ఆఫ్రికా మాత్రం  కొయెట్జ్ స్థానంలో స్పిన్నర్ షంసిని తీసుకొచ్చింది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 7 మ్యాచ్ ల్లో గెలిస్తే.. సౌత్ ఆఫ్రికా 7 మ్యాచ్ ల్లో ఆరు మ్యాచ్ ల్లో విజయం సాధించింది.    

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్):

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ సిరాజ్