భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్పై అమెరికా మరోసారి నోరు పారేసుకుంది. గతంలో భారత్, పాక్ ల మద్య యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్సొంత డబ్బా కొట్టుకోగా.. తాజా అమెరికా కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. యుద్దంలో ఆ రెండు దేశాలు ఓడలేదు, గెలవలలేదు.. గెలిచిందల్లా పక్క దేశం చైనానే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..
మే నెలలో జరిగిన భారత్ పాక్ ఘర్షణల ఫలితాలపై చర్చించిన అమెరికా కాంగ్రెస్ఓ రిపోర్టును కూడా విడుదల చేసింది. నాలుగు రోజుల యుద్దంలో భారత్ , పాక్ లు ఎవరూ కాదు.. చైనానే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను బీజింగ్ అవకాశంగా వాడుకుందని అమెరికా కాంగ్రెస్ ఆరోపించింది. లేటెస్ట్ వెపన్స్, నిఘా వ్యవస్తను ప్రత్యక్షంగా పరీక్షించేందుకు పరీక్ష స్థలంగా మార్చిందని, మరోవైపు పాశ్చాత్య ఆయుధ అమ్మకాలను తగ్గించేందుకు ఆ ఫలితాలను మార్కెట్ చేసుకుందని యుఎస్-చైనా ఆర్థిక ,భద్రతా సమీక్ష కమిషన్ నుంచి కొత్త రిపోర్టులు చెబుతున్నాయి.
యూఎస్ చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ రిపోర్టుల ప్రకారం.. యుద్దంలో రెండు దేశాలు తమ జెట్విమానాలనుకోల్పోయాయి. పాక్ పూర్తి స్థాయిలో చైనా ఆయుధాలను వినియోగించింది. నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ JF-17, J-10C వంటి చైనా యుద్ధ విమానాలు, PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, HQ-9 ,HQ-16 వంటి వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్లను మాత్రమే కాకుండా, చైనా నిఘా ఉపగ్రహాలను ,బీడౌ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను కూడా ఉపయోగించింది. అంటే దాదాపు యుద్దంలో అన్ని రకాల చైనా ఆయుధాలను పాక్ వాడింది.
ఈ ఘర్షణలో మొదటిసారిగా చైనా ఆధునిక ఆయుధ వ్యవస్థలు, HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ, PL-15 క్షిపణులు ,J-10 యుద్ధ విమానాలను క్రియాశీల పోరాటంలో ఉపయోగించారు. ఇది వాస్తవ ప్రపంచ క్షేత్ర ప్రయోగంగా పనిచేస్తోందని రిపోర్టు పేర్కొంది. అయితే భారత్, పాక్ ఘర్షణను చైనా ప్రాక్సీ-వార్ గా మాత్రమే చూడటం పొరపాటు అవుతుందని నివేదిక హెచ్చరించింది.
