
ఇంగ్లాండ్ తో చివరిదైన ఐదో టెస్ట్ కు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గురువారం (జూలై 31) లండన్ లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ టెస్టుకు బుమ్రా దాదాపు దూరమైనట్టు సమాచారం. కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బుమ్రా దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని అతనిపై పని భారాన్ని తగ్గిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో ధృవీకరించింది. ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు మూడు టెస్ట్ మ్యాచ్ లే ఆడతానని చెప్పిన బుమ్రా తన మాటకు కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. బుమ్రా లేకపోవడంతో 1-2 తేడాతో వెనకబడిన టీమిండియా సిరీస్ ను సమం చేసే ఆశలు సన్నగిల్లాయి.
ఈ ఏడాది ప్రారంభంలో బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది. అప్పటి నుంచి బీసీసీఐ వైద్య సిబ్బంది బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. 31 ఏళ్ల బుమ్రా టెస్ట్‌కు 45-50 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలని సూచించారు. ఈ టీమిండియా పేసర్ మాంచెస్టర్‌లో 33 ఓవర్లు, లార్డ్స్‌లో 43 ఓవర్లు, లీడ్స్‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేయడంతో అతనిపై పని భారాన్ని పెంచి రిస్క్ చేసే ఆలోచనలో బీసీసీఐ లేనట్టు తెలుస్తోంది. నాలుగో టెస్టులో బుమ్రా వేగం కూడా గణనీయంగా తగ్గింది. గంటకు 140కి.మీ వేగంతో బౌలింగ్ చేయలేకపోయాడు. బుమ్రా దూరం కావడంతో అతని స్థానంలో ఫిట్ స్ సాధించిన ఆకాష్ దీప్ కు ప్లేయింగ్ 11 లో చోటు ఖాయమైంది.
ALSO READ | అర్ష్ దీప్ వచ్చేస్తున్నాడు.. ఐదో టెస్ట్ కు ఆడించేందుకు సన్నహాలు
ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడాడు. లీడ్స్‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్‌హామ్‌లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ముగిసిన మాంచెస్టర్ టెస్టులో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. ఓవరాల్ గా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్, డాసన్ వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ కెరీర్ లో 47 టెస్టులాడిన బుమ్రా.. 100కి పైగా పరుగులివ్వడం ఇదే తొలిసారి.
Jasprit Bumrah will not play the fifth and final Test of the Anderson-Tendulkar Trophy at The Oval starting on Thursday pic.twitter.com/y5X8QwpTJy
— ESPNcricinfo (@ESPNcricinfo) July 29, 2025