బెట్టింగ్ యాప్స్‌‌‌‌ను ప్రమోట్ చేసేటోళ్లను జైల్లో పెట్టాలి : కేఏ పాల్

బెట్టింగ్ యాప్స్‌‌‌‌ను ప్రమోట్ చేసేటోళ్లను జైల్లో పెట్టాలి : కేఏ పాల్
  • వారు తీసుకున్న డబ్బులను బాధిత కుటుంబాలకు పంచాలి: కేఏ పాల్ 

న్యూఢిల్లీ, వెలుగు: బెట్టింగ్ యాప్స్ నిషేధంపై సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పలుమార్లు వాయిదా పడడంపై ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల 59 కోట్ల మంది ప్రజలు నష్టపోయారని, లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని  పోరాటం చేస్తున్నానని చెప్పారు. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని జైల్లో పెట్టాలని, వారు తీసుకున్న డబ్బులు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. పార్టీ పెట్టినందుకే తనపై రెండు రాష్ట్రాల సీఎంలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.