క్రమశిక్షణతోపని చేయండి..కొత్త ఉద్యోగులకు కిషన్‌‌ రెడ్డి సూచన

క్రమశిక్షణతోపని చేయండి..కొత్త ఉద్యోగులకు కిషన్‌‌ రెడ్డి సూచన

హైదరాబాద్, వెలుగు: క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి దేశ సమగ్రత, సమైక్యతను కాపాడాలని సెంటర్ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన యువతకు కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి సూచించారు. హకీంపేట్‌‌లోని సీఐఎస్‌‌ఎఫ్​ ఆడిటోరియంలో జరిగిన 8వ రోజ్‌‌గార్‌‌‌‌ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్​మెంట్ లెటర్లు అందజేశారు. సీఐఎస్‌‌ఎఫ్, సీఆర్‌‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌‌బీలో ఉద్యోగాలు పొందిన 323 మంది నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌‌ రెడ్డి మాట్లాడారు. యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు. ఇందుకోసం అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతో పాటు, వారికి సరైన అవకాశాలు కల్పించాలనే మోదీ కోరుకుంటారని తెలిపారు. దీనికి తగ్గట్లుగానే 9 ఏండ్లుగా.. ఒక్కో వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు.