
హైదరాబాద్, వెలుగు : మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన కామెంట్లపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. పార్టీ మొత్తం హరీశ్‌రావు వెంటే ఉంటుందని కేటీఆర్తెలిపారు. ‘‘పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు పార్టీతో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ మూలస్తంభంగా కొనసాగుతున్నారు.” అని తేల్చిచెప్పారు.
తెలంగాణ పట్ల సీనియర్‌నాయకుడు హరీశ్‌రావు నిబద్ధత, బీఆర్ఎస్పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హరీశ్‌రావుపై మైనంపల్లి చేసినకామెంట్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.