మళ్లీ భగ్గుమన్న మిడిల్ ఈస్ట్.. డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్, అమెరికా పరస్పర భీకర దాడులు.. లెబనాన్లో 6 మంది మృతి

మళ్లీ భగ్గుమన్న మిడిల్ ఈస్ట్.. డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్, అమెరికా పరస్పర భీకర దాడులు.. లెబనాన్లో 6 మంది మృతి

మిడిల్ ఈస్ట్ నుంచి యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అమెరికా బలగాలను వెనక్కు తీసుకున్నా.. అక్కడ యుద్ధం మాత్రం తగ్గటం లేదు. అడపాదడపా బాంబులు, మిసైళ్లు, డ్రోన్లు పేలుతూనే ఉన్నాయి. 026 మే 28వ తేదీన అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా వేడెక్కింది. 

కువైట్ పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. అమెరికా దాడులకు నిరసనగా.. 2డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుడింది. కువైట్ లోని ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు ఇరాన్ మిలిటరీ IRGC ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా దాడులు చేసినట్లు ప్రకటించింది. 

అంతకు ముందు తెల్లవారు జామున ఇరాన్ పై దాడులకు దిగింది అమెరికా. ఇరాన్ లోని మిలలిటరీ కేంద్రంపై దాడులకు దిగటంతో అక్కడ మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హార్మూజ్ జలసంధిలో నౌకా రవాణాకు ఇరాన్ ఆటంకం కలిగిస్తోందని, అంతే కాకుండా ఇరాన్ మిలిటరీ అమెరికా బలగాలకు ముప్పు కలిగిస్తుందని దాడులకు దిగినట్లు అమెరికా ప్రకటించింది. అందులో భాగంగా బందార్ అబ్బాస్ పోర్టు సమీపంలో దాడులు చేసింది. ఈ దాడులలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 

అమెరికా స్థావరాలే లక్ష్యంగా కువైట్ పై ఇరాన్ దాడికి దిగటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇరాన్ చేసిన దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. 

ఇటు అమెరికా ఇరాన్ పరస్పర దాడులు  చేసుకుంటుంటే.. ఇదే అదనుగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. డ్రోన్లతో విరుచుకుపడటంతో పెద్ద పెద్ద భవంతులు నేలకూలిన పరిస్థితులు. ఈ క్రమంలో దక్షిణ లెబనాన్ సమీపంలోని ప్రజలు వీలైనంత త్వరగా ఉత్తర జహ్రానీ నది వైపు వెళ్లిపోవాల్సిందిగా ఒమన్ అధికార వర్గం సూచించింది. ఇది ఇజ్రాయెల్ బార్డర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతం. 

ఇజ్రాయెల్ దాడితో దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఒక పెద్ద విపత్తు సంభవించినంత నష్టం జరిగిందని చెబుతున్నారు. మరోవైపు  తెల్లవారు జామునుంచి అమెరికా ఇరాన్ డ్రోన్స్, మిస్సైల్స్ ను అడ్డుకుంటూ ఉంది.