
హీరో రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన పోలీస్ కంప్లైయింట్ రోజురోజుకు మలుపు తిరుగుతుంది. జూలై 13న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య.. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించింది. ఆమె వాయిస్ స్టేట్ మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. FIR లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారంగా వివరాలు స్టేట్మెంట్ ఇచ్చానని లావణ్య తెలిపారు. మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఆమెను ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఫిర్యాదులో చెప్పారు. ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు సాగుతుందని పోలీసులు తెలిపారు.
ALSO READ | రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్: అర్థరాత్రి లావణ్య ఆత్మహత్యాయత్నం