అధికారం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవంపై మాట తప్పారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. MIM చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అని ఆరోపించారు. రజాకార్ల వారసత్వాన్ని TRS కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరవేశారు బీజేపీ కార్యకర్తలు. తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
