ఎవరైనా తప్పిపోతే చిలక జ్యోస్యం చెప్పించుకుంటాం.. అలాంటి చిలక తప్పిపోయింది.. అల్లారు ముద్దుగా పెంచుకుంటుండగా తప్పిపోయిందంట.. ఇప్పుడు ఆ పెంపుడు చిలక కోసం పోస్టర్లు వేశారు.. ఆటో రిక్షాలో ప్రచారం చేస్తున్నారు.. ఆచూకీ చెబితే 10 వేల రూపాయల డబ్బులు కూడా ఇస్తామంటున్నారు.. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
తమకు ఎంతో ఇష్టమైన…ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చిలక కనిపించకుండా పోవడంతో ఓ కుటుంబం విలవిల్లాడిపోతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలక కోసం రేయింబవళ్ళూ వెతుకుతున్నారు. ఆచూకీ చెప్పినవారికి రూ. 10,000 నజరానా ఇస్తామంటూ పోస్టర్లు వేశారు. ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో చోటుచేసుకుంది.
పెంపుడు చిలుక కనిపించకుండాపోయింది (దాని ఆచూకీ తెలిపిన వారికి బహుమతిగా పది వేలు నగదు ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించాడు. అంతేగాక పోస్టర్లు అంటించడంతోపాటు వాహనాల ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీపక్ సోనీకి చెందిన పెంపుడు చిలుక మంగళవారం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన అతడు దాని కోసం వెతకసాగాడు. అలాగే చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల క్యాష్ రివార్డు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా నగరంలోని పలు చోట్ల అంటించాడు. అలాగే ఆటోలపై మైక్‌లు ఏర్పాటు చేసి తప్పిపోయిన చిలుక గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు.
ఆ చిలుకతో తమ కుటుంబానికి రెండేండ్లుగా అనుబంధం ఉందని దీపక్ తెలిపాడు. గత వారం కూడా ఆ చిలుక ఎగిరిపోయిందని, దానికదే తిరిగి వచ్చిందని చెప్పాడు. అయితే ఈసారి మాత్రం ఆ చిలుక జాడ ఎక్కడా కనిపించ లేదన్నాడు. ఆ చిలుక సరిగ్గా ఎగురలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. కుక్క మెరగడంతో భయపడిన అది ఎక్కడో దాగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. చిలుక గురించి సమాచారం తెలిపిన వారికి ప్రకటించిన పది వేల నగదు కంటే ఎక్కువగానే ఇస్తానని మీడియాతో అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A few months ago, videos of friendship between a Sarus crane and a man in UP went viral A similar story of love has emerge from Damoh where a man is frantically searching for his missing parrot. pic.twitter.com/CTm8C1pD6M
— Anurag Dwary (@Anurag_Dwary) August 2, 2023

