ఇండియా నుంచి వలసలు భారీగా పెరగటం.. విదేశాల్లో మనోళ్ల స్థిరపడి పోవటం.. ఇండియన్స్ తమ దేశాలను కబ్జా చేస్తున్నారని అమెరికా, కెనడా లాంటి దేశాలు గగ్గోలు పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. కొన్ని దేశాల్లో మైనారిటీలుగా ఉంటున్న ఇండియన్స్.. మరికొన్ని దేశాలలో మెజారిటీ కమ్యూనిటీలుగా మారుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నగానీ.. న్యూజీలాండ్ అయితే త్వరలో న్యూ ఇండియాగా రూపాంతరం చెందుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.
మీరు చదివిన హెడ్ లైన్ వాస్తవమే. న్యూజీలాండ్ మరికొన్నేళ్లలో న్యూ ఇండియా కాబోతోంది. ఇండియా నుంచి వలసలు పెరగటమే కాదు.. సంతానోత్పత్తిలో కూడా మనోళ్లు అక్కడి వాళ్లతో పోల్చితే బెటర్ గా ఉండటమే అందుకు కారణం. స్టాటిస్టిక్స్ న్యూజిలాండ్ విడుదల చేసిన అఫీషియల్ బర్త్ రిజిస్ట్రేషన్ స్టాటిస్టిక్స్ (అధికారిక జనన నమోదు గణాంకాల) ప్రకారం, దేశంలో పుట్టిన ప్రతి ఎనిమిది మంది శిశువులలో ఒకరి తల్లి భారత మహిళ కావడం విశేషం.
న్యూజీలాండ్ లో యూరోపియన్ మూలాలు ఉన్న జనాభాతో పోల్చితే ఇండియన్స్ జనాభా పెరిగిపోతుండటం ఇక్కడ విశేషం. దీనికి కారణం ఇండియా నుంచి నిరంతర వలసలు, ఇండియన్స్ సంతానోత్పత్తి పెరుగుతుండటం అని నివేదికలో పేర్కొన్నారు.
న్యూజీలాండ్ లో2008 నుంచి జననాలలో ఇండియన్స్ వాటా నాలుగు రెట్లకు పైగా పెరిగినట్లు తెలిపింది. గత 16 సంవత్సరాలుగా భారతీయ తల్లులకు పుట్టిన పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇది న్యూజిలాండ్ అంతటా భారతీయ మూలాల జనాభా వేగంగా వృద్ధి చెందడాన్ని ప్రతిబింబిస్తున్నట్లు చెబుతున్నారు.
2008 నుంచి వృద్ధి శాతం :
- 2008: 2.8%
- 2012: 3.5%
- 2016: 5.5%
- 2020: 7.9%
- 2024: 12.6%
డేటా ప్రకారం.. 2008లో 2.8 శాతం ఉన్న జననాల రేటు పెరుగుదల.. 2024 వచ్చేసరికి 12.4 శాతానికి పెరగినట్లు న్యూజీలాండ్ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. అంటే 2008 నుండి భారత మహిళలకు పుట్టిన పిల్లల వాటా నాలుగు రెట్లకు పైగా పెరిగిందని స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి.
వలసలు, యంగర్ జనరరేషన్:
న్యూజీలాండ్ లో భారతీయులు పెరగటానికి కారణం.. ఒకటి వలసలు అయితే మరొకటి అక్కడ ఉన్న ఇండియన్స్ వయసు చాలా తక్కువగా ఉండటమే. దాదాపు యవ జనాభానే అక్కడికి వలసలు వెళ్లటం, సెటిల్ అవుతుండటంతో.. సంతానోత్పత్తి, జననాలా రేటు ఇండియన్స్ ది ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో స్థానిక న్యూజీలాండ్ ప్రజలతో పోల్చితే ఇండియన్స్ సంతానోత్పత్తి, జానాభా పెరుగుతూ వస్తోంది. న్నారు.
గత 20 ఏళ్లలో వచ్చిన ఇండియన్ మైగ్రెంట్స్ లో సంతానోత్పత్తికి అనువైన వయస్సులో ఉన్న యంగ్ స్టర్స్ ఉండటం ఇక్కడ కీలకంగా మారింది. దీనివల్ల, న్యూజిలాండ్‌లో ఉన్న యూరోపియన్ మూలాలు ఉన్న జనాభా వయసు పైబడిన వారు కావడం.. వారితో పోల్చితే ఇండియన్స్ యంగ్ స్టర్ కావడంతో ఇండియన్స్ కు పుడుతున్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఆక్లాండ్, హామిల్టన్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ వంటి సిటీల్లో ఇండియన్ కమ్యూనిటీలు కీలకంగా పెరిగాయి. అనేక కుటుంబాలు శాశ్వతంగా స్థిరపడటానికి న్యూజీలాండ్ ను ఎంచుకుంటున్నాయి. న్యూజిలాండ్ మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు సుమారు 1.5–1.6 జననాలకు పడిపోయింది,.
ఇక ఆసియా మహిళల సంతానోత్పత్తి రేటు అంచనా సుమారు 1.32గా ఉన్నప్పటికీ, ఇండియన్ మహిళలకు చైనా మహిళల కంటే సాధారణంగా అధిక సంతానోత్పత్తి సామర్థ్యం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
భవిష్యత్తు ఇండియన్స్ దేనా..?
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో వివిధ జాతుల ప్రజలలో సంతానోత్పత్తి తగ్గిపోవటం ఆందోళనకరమైన అంశంగా మారింది. ముఖ్యంగా రష్యా, జపాన్, న్యూజీలాండ్ తదితర దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అదేసమయంలో ఇండియన్స్ సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటం.. ప్రస్తుతం న్యూజీలాండ్ లో మనోళ్ల సంఖ్య పెరగటానికి ముఖ్య కారణంగా మారింది.
దేశంలో పెరుగుతున్న భారతీయ జనాభా ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, సమాచార సాంకేతికత, విద్య, రిటైల్, వ్యాపార రంగాలలో దూసుకుపోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్స్ పెరుగుతున్న సరళిని పరిశీలిస్తే రాబోయే కాలంలో న్యూజీలాండ్ లో ఇండియన్స్ మెజారిటీ స్థాయికి చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదని అంటున్నారు.
