చెత్తను మున్సిపల్ బండిలోనే వేయాలి : కమిషనర్ రఘు ప్రసాద్

చెత్తను మున్సిపల్ బండిలోనే వేయాలి : కమిషనర్ రఘు ప్రసాద్
  • మల్కాజ్ గిరి అడిషనల్​ కమిషనర్ రఘు ప్రసాద్ 

మల్కాజ్ గిరి, వెలుగు: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్(పారిశుద్ధ్యం) రఘు ప్రసాద్ ఐయన్ నగర్ పరిధిలో శుక్రవారం పర్యటించి రైల్వే ట్రాక్ పరిసరాలను పరిశీలించారు. స్థానిక ఎన్జీవో ప్రతినిధి కరుణాకర్ వినతిపై ఈ పర్యటన చేపట్టారు. ఐయన్ నగర్ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న మిలటరీ రైల్వే ట్రాక్ ఇరువైపులా చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోయినట్లు గుర్తించారు. 

ఈ సందర్భంగా రఘు ప్రసాద్ మాట్లాడుతూ, ఇంటి చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వంద ట్రిప్పులకుపైగా చెత్తను తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జాకియాసుల్తానా, అధికారులు శ్రీనివాసాచారి, సూపర్​వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.