V6 News

బీఆర్ఎస్ లోనే ఉన్నా.. పార్టీ మారుతలేను : మాజీ మంత్రి మల్లారెడ్డి

బీఆర్ఎస్ లోనే ఉన్నా.. పార్టీ మారుతలేను : మాజీ మంత్రి మల్లారెడ్డి

పద్మారావునగర్, వెలుగు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బోయిన్​పల్లిలో తన దత్తపుత్రుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన ఆవేశంగా సమాధానమిచ్చారు. తాను ఇప్పటికీ బీఆర్‌‌ఎస్​లోనే ఉన్నానని, కేవలం ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అనంతరం మరేమీ మాట్లాడకుండా ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.