రూ.90వేల విలువైన లెన్స్ ఆర్డర్ చేస్తే.. క్వినోవా విత్తనాలు వచ్చినయ్

రూ.90వేల విలువైన లెన్స్ ఆర్డర్ చేస్తే.. క్వినోవా విత్తనాలు వచ్చినయ్

ఆన్ లైన్ షాపింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత .. చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం కస్టమర్లలో అనేక భయాందోళనలను తెచ్చి పెడుతుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అమెజాన్ లో రూ.90వేల విలువైన కెమెరా లెన్స్ ను ఆర్డర్ చేయగా.. అతనికి డెలివరీ అయిన క్వినోవా విత్తనాలు(ఊదలు) రావడంతో షాక్ కు గురయ్యాడు.

జూలై 5న అమెజాన్ లో సిగ్మా 24-70 ఎఫ్ 2.8 లెన్స్‌ని ఆర్డర్ చేసినట్టు అరుణ్ కుమార్ మెహెర్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టులో చెప్పుకొచ్చాడు. మరుసటి రోజు ప్యాకేజీని అందుకున్నానని, బాక్స్ అప్పటికే తెరిచినట్టుగా ఉందని, అందులో క్వినోవా విత్తనాలు వచ్చాయని చెప్పాడు. దీనిని ''పెద్ద స్కామ్'' గా పేర్కొన్న ఆ వ్యక్తి.. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ అమెజాన్ ను ట్యాగ్ చేశాడు. దాంతో పాటు తాను రిసీవ్ చేసుకున్న క్వినోవా విత్తనాలను చూపే రెండు ఫొటోలను కూడా పంచుకున్నాడు. తాను ఆర్డర్ చేసిన లెన్స్ ను పంపించాలని, లేదంటే డబ్బునైనా తిరిగి చెల్లించమని కోరాడు.

ఈ ట్వీట్ పై స్పందించిన అమెజాన్.. 'ఈ ఆర్డర్ తో మీరు కలత చెందారని మేము భావిస్తున్నాము. మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. దయచేసి డైరెక్ట్ మెసేజ్ చేసి తద్వారా మమ్మల్ని సంప్రదించండి. మేము సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తాము. ఇంకా, దయచేసి మీ ఆర్డర్/ఖాతా వివరాలను అందించవద్దు ఎందుకంటే మేము వాటిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తాం అని ట్వీట్ లో పేర్కొంది.

Ordered a 90K INR Camera lens from Amazon, they have sent a lens box with a packet of quinoa seeds inside instead of the lens. Big scam by @amazonIN and Appario Retail. The lens box was also opened. Solve it asap. pic.twitter.com/oED7DG18mn

— Arun Kumar Meher (@arunkmeher) July 6, 2023