మంచిర్యాల జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం..రైతులను ఇబ్బంది పెట్టొద్దు

మంచిర్యాల జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం..రైతులను ఇబ్బంది పెట్టొద్దు

జైపూర్(భీమారం), వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ మధుసూదన్ సూచించారు. శనివారం భీమారం మండల కేంద్రంతో పాటు పోలంపల్లి, అంకూశాపూర్, ఆరేపల్లి, బూరుగుపల్లి, నర్సింగాపూర్, కాజిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏపీఎం శ్రీనివాస్ తో కలిసి వారు ప్రారంభించారు. సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.