సీపీఆర్ నేర్చుకున్న కేంద్ర మంత్రి

సీపీఆర్ నేర్చుకున్న కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ కార్డియోపల్మోనరీ రిససిటేషన్(సీపీఆర్) టెక్నిక్​పై శిక్షణ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఆన్​లైన్​లో సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ బాఘెల్‌‌తో కలిసి సీపీఆర్  ట్రైనింగ్ తీసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఆర్​ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సీపీఆర్ టెక్నిక్‌‌లో శిక్షణ పొందితే.. కార్డియాక్ అరెస్ట్​కు గురైన  వారి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అలాగే, సమతుల ఆహారం తీసుకో వడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని మాండవీయ చెప్పారు.