కేసీఆర్కు భయపడే మునుగోడు నోటిఫికేషన్

కేసీఆర్కు భయపడే మునుగోడు నోటిఫికేషన్

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారన్న భయంతోనే మునుగోడు నోటిఫికేషన్ ప్రకటించారన్ని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం కేసీఆర్ సమావేశాన్ని చూసి ప్రధాని మోడీ, అమిత్ షాలకు రాత్రి నిద్రలేక మునుగోడు నోటిఫికేషన్ ఇప్పించారని విమర్శించారు. మునుగోడు ఎన్నిక కోసం టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పారు. దేశానికి ద్రోహం చేస్తూ.. రైతులకు మీటర్లు , నిత్యవసరాలు ధరలు పెంచి జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధినిచెప్పడానికి మునుగుడు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. వ్యవస్థలను ప్రైవేట్ పెత్తందారులకు దోచిపెడుతున్న బీజేపీ దుష్ట పన్నాగానికి చెక్ పెట్టడానికి మునుగోడు ప్రజలు సిద్ధం ఉన్నారన్నారు. 

కాంగ్రెస్తోనే పోటీ..
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడం సంతోషంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుందని అనుకున్నామని..ఓటమి భయంతో ఆలస్యం చేశారని చెప్పుకొచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్కు కాంగ్రెస్తోనే పోటీ అని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా..మునుగోడులో గెలిచి తీరుతామని స్పష్టం చేశారు.

కేసీఆర్ను మించిన వారు లేరు..
బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజల మనసుల్లోంచి కేసీఆర్ ను తీసివేయడం ఎవరి వల్ల కాదన్నారు.  బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఆపలేదన్నారు.ఎలాంటి పరిస్థితిని అయినా..తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో  కేసీఆర్ను మించిన వారులేరన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశం అంతటా మారుమోగుతున్నాయని తెలిపారు. దేశంలో కొత్త అభివృద్ధి నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  తెలంగాణ పథకాలు తమకు అందించాలని దేశ ప్రజలు మోడీని ప్రశ్నిస్తున్నారని..అందుకే బీజేపీకి కేసీఆర్ కంటగింపుగా మారిండన్నారు. తెలంగాణ ప్రజాలు కేసీఆర్ను  జాతీయ రాజకీయాలకు పంపుతున్నారని....తెలంగాణ సంక్షేమం దేశమంతా విస్తరించాలని కోరుకుంటున్నారని చెప్పారు.