ప్రజలు భద్రత గురించి ఆలోచించాలి : మంత్రి సీతక్క

ప్రజలు భద్రత గురించి ఆలోచించాలి : మంత్రి సీతక్క
  • మంత్రి సీతక్క సూచన

కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రజలు తమ అవసరాల కంటే ముందు భద్రత గురించి అలోచించాలని మంత్రి సీతక్క సూచించారు. అరైవ్‌‌‌‌, అలైవ్‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా 300 కిలోల ఇనుముతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ హెల్మెట్‌‌‌‌ను మంగళవారం మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హెల్మెట్‌‌‌‌ ప్రాణాలను కాపాడే కవచం అన్నారు. అరైవ్‌‌‌‌, అలైవ్‌‌‌‌ పోగ్రాం నినాదంగా మిగిలిపోకుండా ప్రతి ఒకరిలో బాధ్యత పెంచే ఉద్యమంగా సాగాలని చెప్పారు.

ప్రతి ఒక్కరూ హెల్మెట్‌‌‌‌ ధరించడంతో పాటు ట్రాఫిక్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అనంతరం పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌‌‌‌ అలీ, ఎమ్మెల్సీ, పీపీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎంపీ సురేశ్‌‌‌‌ షేట్కార్, కలెక్టర్‌‌‌‌ ఆశిష్‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌, ఎస్పీ రాజేశ్‌‌‌‌ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి పాల్గొన్నారు.