హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : మంత్రి శ్రీధర్ బాబు
  •     ఎంఎన్​సీలను ఆకర్షించేలా కాంప్రెహెన్సివ్ ఎకో సిస్టమ్​ను డెవలప్​చేస్తున్నం : మంత్రి శ్రీధర్ బాబు 
  •     హైటెక్ సిటీలో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేవలం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) అడ్డాగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయి సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, సవాళ్లు, భవిష్యత్ టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా బహుళజాతి కంపెనీ(ఎంఎన్​సీ)లను ఆకర్షించే పటిష్టమైన కాంప్రెహెన్సివ్ ఎకో సిస్టమ్ ను డెవలప్ చేస్తున్నామని చెప్పారు. నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రముఖ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ దిగ్గజ సంస్థ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్ హైటెక్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ రంగాల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రపంచ దిగ్గజ సంస్థలకు ప్రధాన గమ్యస్థానంగా మార్చామన్నారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్ లాంటి గ్లోబల్ కంపెనీల విస్తరణే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో తెలంగాణ యువత అత్యుత్తమ ఉద్యోగాలు దక్కించుకునేలా వారికి డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజినీరింగ్, ఏఐ వంటి అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

ఆవిష్కరణలకు అండగా ప్రభుత్వం 

రాష్ట్రంలో అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిజిటల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాగా, హైటెక్ సిటీలో దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటైన బ్యాక్ బేస్ కేంద్రం ద్వారా రాష్ట్రంలో కొత్తగా 300 మంది హై-స్కిల్డ్ నిపుణులకు ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో నెదర్లాండ్స్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ యాన్ క్రెమర్స్, బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) గ్రెగ్ ఫాహి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హార్డ్ షీల్, ఇండియా సైట్ హెడ్ సురభి శర్మ పాల్గొన్నారు.