మియాపూర్లో ప్రివెంటివ్ డ్రైవ్

మియాపూర్లో ప్రివెంటివ్ డ్రైవ్

మియాపూర్‌‌, వెలుగు: ఇటీవల వరుస హిట్ అండ్ రన్ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రత్యేక ప్రివెంటివ్ డ్రైవ్ చేపట్టారు. ఫుట్‌‌పాత్‌‌లపై నివసిస్తూ అక్కడే నిద్రిస్తున్న యాచకులను 22 మందిని మియాపూర్ ఇన్‌‌స్పెక్టర్ శివప్రసాద్ పర్యవేక్షణలో బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలేటి అటమ్ వరల్డ్ ఆశ్రమానికి తరలించారు. తాత్కాలిక నివాసం, భోజన వసతి కల్పించారు.